ఈ కాలంలో స్టార్ హీరోలు తీసుకుంటున్న పారితోషికాలు ఎంతగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్ అయినా ఫ్లాప్ అయినా, వారి రెమ్యునరేషన్ మాత్రం ఎక్కడో చుక్కల్లో ఉంది. ఇటీవలి కాలంలో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ వి.ఐ. శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని హైలైట్ చేశాయి. హిట్లు లేకపోయినా, డిజాస్టర్ హీరోలను కూడా పిలిచి కోట్లు కట్టబెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.